: ‘ఇంకా..నన్ను సుశాంత్ కు మాజీ ప్రేయసి అంటారేంటి?’.. మీడియాపై మండిపడ్డ బుల్లితెర నటి!


ఇప్పటికీ తనను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంటారేంటంటూ మీడియాపై బుల్లితెర హిందీ నటి అంకిత లోఖండే మండిపడింది. ప్రస్తుతం తాను నటిస్తున్న హిందీ సీరియల్స్, సినిమాల గురించి ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించింది. తాను తొలిసారిగా బాలీవుడ్ చిత్రంలో నటించానని, ఇకపై, ఈ విషయం గురించే అందరూ మాట్లాడతారని తాను ఆశిస్తున్నానంటూ మీడియాకు చెప్పింది. కాగా, ‘ధోనీ’ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ లోకి ప్రవేశించకముందు ‘పవిత్ర రిష్తా’ అనే హిందీ బుల్లితెర సీరియల్ లో నటించాడు. సుశాంత్, అంకిత ఈ సీరియల్ లో భార్యాభర్తలుగా నటించారు.

ఈ సీరియల్ లో చేస్తున్న సమయంలోనే వారి మధ్య ప్రేమవ్యవహారం మొదలైంది. అయితే, దినేష్ విజయన్ దర్శకత్వంలో సుశాంత్ సింగ్, కృతిసనన్ ‘రాబ్తా’ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రంలో సుశాంత్ నటిస్తున్న సమయంలోనే అతనికి అంకితతో విభేదాలు తలెత్తాయి. దీంతో, వాళ్లిద్దరూ విడిపోయారు. వీరు విడిపోవడానికి కృతిసనన్ కారణమంటూ బాలీవుడ్ వర్గాల గుసగుసలు. ఇంతకీ, వాళ్లిద్దరూ విడిపోయింది నిన్నోమొన్నో కాదు.. ఏడాదికి పై మాటే!

  • Loading...

More Telugu News