: సొంత రాష్ట్రానికి సర్వీస్ చేస్తానంటున్న మిస్ కెనడా.. వీడియో చూడండి
మిస్ నార్థన్ అల్బర్టా వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకున్న కల్యాణపు శ్రావ్య తన జన్మభూమి నుంచి సమాజానికి సేవ చేస్తానని తెలిపింది. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు చెందిన కల్యాణపు రవికుమార్ కుమార్తె శ్రావ్య. ఆదిలాబాద్ ఇచ్చోడలో ఆయన ఏఈగా పని చేసిన సమయంలో శ్రావ్య అక్కడే ఏడవ తరగతి వరకు చదువుకుంది. అనంతరం ఆ కుటుంబం కెనాడాకు వెళ్లిపోయారు. అక్కడ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఆల్ బెట్రాలో కెమికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న శ్రావ్య...ఆర్గానిక్ లిప్ స్టిక్ లు తయారు చేస్తున్నామని తెలిపింది. తన తల్లిదండ్రుల స్వగ్రామంలో ఒక ప్రభుత్వపాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని, వాటిని సమకూర్చే ప్రయత్నంలో తామున్నామని ఆమె తెలిపింది. జన్మభూమిని మర్చిపోకూడదని తన గ్రాండ్ పేరెంట్స్ చెబుతుంటారని, వారు చెప్పినట్టు చేయడంలో ఆనందం ఉంటుందని శ్రావ్య తెలిపింది. కాగా, ఈ నెలలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఆమెకు ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా మద్దతు తెలపాలని పలువురు సూచిస్తున్నారు.