: అమెరికాలో మోదీని ఆదుకున్న అజిత్ ధోవల్!
అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ ఎదుర్కొన్న సంకటస్థితి నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ బయటపడేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... వైట్ హౌస్ లో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ను కలిసిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని ఏం మాట్లాడాలన్న దానిపై నోట్స్ రాశారు. ప్రధాని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతలో గాలికి ప్రధాని ప్రసంగం ప్రతులు ఎగిరిపోయాయి. దీంతో ముందువరుసలో కూర్చున్న ధోవల్ వేగంగా స్పందించి, ఆ ప్రతులను మళ్లీ ప్రధానికి అందించారు. ఇలా రెండు సార్లు జరగగా, రెండు సార్లు అజిత్ ధోవలే స్పందించి, ఆ పేపర్లను ఏరి తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో ప్రధాని యథాలాపంగా, ఎలాంటి తత్తరపాటుకు గురికాకుండా మీడియా సమావేశం ముగించారు.