బామ్మగారి నిర్వాకానికి.. ప్రయాణికులను దింపేసి, విమానం ఇంజిన్‌ను విప్పేసి.. మరమ్మతు చేశారు!

27-06-2017 Tue 20:08 | Both States
భారతీయులు కొంద‌రు ట్రైన్‌లో వెళుతున్న‌ప్పుడు ఏవైనా న‌దులు వ‌స్తే కిటికీలోంచి నీళ్ల‌లోకి రూపాయి, రెండు రూపాయ‌ల నాణేల‌ని విసిరేస్తుంటారు. అలా చేస్తే మంచిద‌ని వారి న‌మ్మ‌కం. ఇంచుమించు ఇటువంటి పనే చేసింది ఓ చైనా బామ్మ‌. అయితే, ఆమె నాణేల‌ను నీళ్ల‌లో వేయ‌లేదు.. విమానం ఎక్కుతూ దాని ఇంజిన్‌లో వేసింది.. అలా చేస్తే మంచి జ‌రుగుతుంద‌ని ఆ బామ్మ భావించింది. ఆమెకు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని విచారణలో అధికారులకు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, షాంఘై పుడోంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చైనా విమానం 150 మంది ప్ర‌యాణికుల‌తో సీజెడ్‌ 380 గాంగ్జౌ పట్టణానికి బయల్దేరేందుకు సిద్ధంగా ఉండ‌గా.. గాంగ్జౌకు వెళ్లేందుకు విమానం ఎక్కుతున్న‌ 80 ఏళ్ల బామ్మ ఈ ప‌నిచేసింది.

ఆమెతో పాటు ఆమె భర్త, కూతురు, అల్లుడు ఉన్నారు. ఆ బామ్మ నాణేలు ఇంజిన్‌లోకి ప‌డవేయ‌గానే ఈ విషయాన్ని గ‌మ‌నించిన ఓ ప్ర‌యాణికుడు అధికారుల‌కు స‌మాచారం అందించాడు. దీంతో  ఆ విమానాన్ని ఆపేసి, విమానం ఇంజిన్‌ను విప్పేసి, మరమ్మతు చేశారు. దీంతో ఆ విమానం కొన్ని గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఆ పని చేసిన బామ్మతో పాటు ఆమెతో ఉన్న కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. ఆ బామ్మ విమాన‌ ఇంజిన్‌లోకి తొమ్మిది నాణేలను విసిరేసిందని చెప్పారు. అలా చేస్తే తమకు ఎలాంటి హానీ జరగకుండా ఉంటుంంద‌ని ఆ బామ్మ భావించింద‌ని అన్నారు.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more