మీకు ఫొటోలు తీసే అలవాటుందా?.. అయితే మీకో గుడ్ న్యూస్!

27-06-2017 Tue 09:14 | Offbeat
మీకు ఫొటోలు తీసే అలవాటు ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్! ఫొటోలు తీసే అలవాటు వల్ల విజువల్ మెమొరీ (దృశ్యాలను గుర్తుంచుకోవడం) మెరుగవుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే ఫొటోలు తీసే అలవాటు దృశ్య సంబంధ విషయాలను గుర్తుంచుకునే తీరును మెరుగుపరిచినా వినే(శ్రవణ సంబంధమైన) అలవాటుకు కొంత చేటు కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన అలెగ్జాండ్రియా బరాష్, యూఎస్‌సీ మార్షల్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన క్రిస్టిన్ డీల్, వార్తాన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన జాకీ సిల్వర్ మ్యాన్, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన గాల్ జాబెర్‌మన్‌లు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

ఫొటోలు తీసే అలవాటున్న వారు ఆ అనుభవాలను స్నేహితులతో  డిన్నర్ చేస్తున్నప్పుడు, విహారయాత్రల సమయంలోను, మరో సందర్భంలోనూ పంచుకుంటారని వారు తెలిపారు. 294 మందిపై జరిపిన ఈ అధ్యయనంలో పలు ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడైనట్టు వారు తెలిపారు. గతంలో ఎప్పుడో  తీసిన ఫొటోలను చూపించినప్పుడు కూడా వాటికి సంబంధించిన విషయాలను వారు పూసగుచ్చినట్టు చెప్పడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీనిని బట్టి మనం విన్నదాని కంటే చూసిన విషయమే ఎక్కువ కాలం గుర్తుంటుందని తేలిందని వివరించారు. అయితే అదే సమయంలో అధ్యయనంలో పాల్గొన్న వారు  విన్న విషయాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడినట్టు గుర్తించారు. వారికి కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానమిచ్చినట్టు అధ్యయనకర్తలు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు సైకలాజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more