: ఈ నెల 30న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం: వెంకయ్య నాయుడు
వచ్చేనెల 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తున్న జీఎస్టీపై చర్చించడానికి ఈ నెల 30న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ విధానాన్ని ఇప్పటికే 142 దేశాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. భారత్‌లో ఇది అమలు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని, అందులో 6 శ్లాబులు.. 0, 5, 12, 18, 28, 43 శాతంలో పన్నులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ధరలు దిగి రావడమే కాకుండా అవినీతి తగ్గుతుందని తెలిపారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే జీఎస్టీ కౌన్సిల్ పరిష్కరిస్తుందని తెలిపారు.