Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఓడిపోయినందుకు బాధ లేదు.. కానీ..!: అల్లు అర్జున్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ మీడియా సంస్థతో పంచుకున్నాడు. క్రికెట్ చూడాలనే కోరిక ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్ కారణంగా అన్ని మ్యాచ్ లు చూడటానికి వీలు పడటం లేదని చెప్పాడు. అయితే, కీలకమైన మ్యాచ్ లు, ఫైనల్స్ మాత్రం సాధ్యమైనంత వరకు వదలిపెట్టకుండా చూస్తుంటానని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఇండియా ఓడిపోవడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యానని ఈ సందర్భంగా బన్నీ అన్నాడు. భారత్ ఓడిపోయినందుకు ఎక్కువ బాధ లేదు కానీ... చాలా తేడాతో ఓడిపోయినందుకు మాత్రం బాధ పడ్డానని చెప్పాడు. ఆటల్లో గెలుపు, ఓటములు సాధారణమే అని చెప్పాడు.

More Telugu News