: కుంబ్లే సిన్సియారిటీ... ఆటగాళ్ల నిర్లక్ష్యం... ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ లో ఏం జరిగిందంటే...!


టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేతో ఆటగాళ్లు వ్యవహరించిన విధానంపై పలు కథనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో సంఘటన కుంబ్లే నిబద్ధతను చాటుతుంటే ఆటగాళ్ల నిర్లక్ష్యాన్ని, అవమానకరంగా వ్యవహరించిన విధానాన్ని వెల్లడిస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ వార్మప్‌ మ్యాచ్‌ లో ఓటమి అనంతరం జట్టులోని ఆటగాళ్ల తప్పొప్పులను గుర్తించేందుకు వీడియో అనలిస్ట్‌ తో చీఫ్ కోచ్ కుంబ్లే సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రతి ఆటగాడి బలహీనతల వీడియోలు తయారు చేసి, వాటిని సరిదిద్దుకోవాల్సిన విధానం గురించి నోట్సు రాశారు.

ఆ రోజు రాత్రి ప్రతి ఆటగాడికి సహాయ సిబ్బందితో వీడియోతో పాటు నోట్స్ ను కూడా పంపించి, బలహీనతలు సరిదిద్దుకోవాలని సూచించారు. కానీ రెండు రోజుల తరువాత చూస్తే ఆ వీడియోలను ఒక్క ఆటగాడు కూడా చూడకపోవడం విశేషం. పోనీ అతనిచ్చిన నోట్స్ అయినా చూశారా? అంటే అది కూడా లేదు. సాధారణంగా సీనియర్ ఆటగాళ్లు ఇచ్చే సూచనను ఆటగాళ్లు పరిగణనలోకి తీసుకుని, ఆటతీరు మెరుగుపర్చుకుంటారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కుంబ్లే రాసిన నోట్స్ ను పట్టించుకోకపోవడం కారణంగా ఆటగాళ్ల వ్యవహారశైలి అర్థమవుతోంది. దీనిని అవమానంగా భావించిన కుంబ్లే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరినీ విమర్శించకుండా హుందాగా తప్పుకున్నారు.

  • Loading...

More Telugu News