Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి పెట్రోలు, డీజిల్ ధరలు!

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు నిత్యమూ మారతాయన్న సంగతి తెలిసిందే. తొలుత అనుకున్నట్టు అర్థరాత్రి 12 గంటలకు కాకుండా, రోజూ ఉదయం 6 గంటలకు ధరలను సవరించాలన్న బంకుల యాజమాన్యాల కోరికకు చమురు కంపెనీలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 64.55, డీజిల్ ధర రూ. 53.96 గా ఉంది. ఇక కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 67.30, డీజిల్ ధర రూ. 56.12గా ఉండగా, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 68.57, డీజిల్ రూ. 58.73గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ. 75.78, డీజిల్ ధర రూ. 59.34గా ఉంది.

More Telugu News