: కేశినేని నాని నీతిమంతుడా?... వ్యాపారం చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?: ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు
టీడీపీ ఎంపీ కేశినేని నాని నీతిమంతుడా? అని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో ట్రావెల్ సంస్థలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహణలో సుదీర్ఘ కాలం కేశినేని నాని అనుసరించిన విధానాలనే ఏపీలోని అన్ని ట్రావెల్ సంస్థలు అనుసరించాయని అన్నారు. ఈ రోజు వ్యాపారం వదిలేసి...నేనొక్కడినే నీతిమంతుడిని అన్నట్టు మాట్లాడడం సరికాదని ఆయన సూచించారు.
కేశినేని నాని బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తయారు కాలేదా? అని ఆయన అడిగారు. ఈ సందర్భంగా కేశినేని నాని బస్సులకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు ఇచ్చారు. కేశినేని నానితో తమకు ఎలాంటి వివాదం లేదని, ఆయన ఎంపీ అని, బాధ్యత గలిగిన ప్రజాప్రతినిధి కనుక తమ సమస్యలు ఆయనతో కూడా చెప్పుకుంటామని ఆయన తెలిపారు.