: రాజీవ్ తో శిరీష అక్రమ సంబంధం గురించి ఆమె భర్తకు తెలియదు: సీపీ మహేందర్ రెడ్డి


తన భార్య శిరీషకు రాజీవ్ తో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె భర్త సతీష్ చంద్రకు తెలియదని హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రాజీవ్ కు చెందిన ఆర్జే ఫొటొగ్రాఫర్స్ లో పనిచేస్తున్న శిరీష... ఆఫీస్ కు వెళ్లడం, అక్కడ నుంచి రావడం మాత్రమే సతీష్ చంద్రకు తెలుసని చెప్పారు. తన భార్యకు రాజీవ్ తో శారీరక సంబంధం ఉందనే విషయాన్ని ఆయన ఇప్పటికీ నమ్మలేకపోతున్నారని అన్నారు. మరోవైపు, శిరీషకు మద్యం తాగే అలవాటు ఉందని నిందితులు చెబుతున్నారని... అయితే, ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లినప్పుడు ఆమె తాగిందా? లేదా? అనే విషయం ఇంకా వెల్లడి కాలేదని... సంబంధిత టెస్ట్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఈ విషయం తేలుతుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News