: కుకునూరు పల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై స్నేహితులతో చెప్పిన చివరి మాటలేంటంటే...!


సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో బ్యూటిషియన్ శిరీషతో ప్రభాకర్ కు పరిచయం వుందని, ఆమె మృతి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్తలు రాగా... అసలు ప్రభాకర్ రెడ్డి తన స్నేహితులతో చివరి సారి ఏమన్నాడన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

‘నేను కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నాను. హైదరాబాద్‌ కు బదిలీ చేయించుకుంటాను’’ అని స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొంత మంది వాదిస్తుండగా, ప్రభాకర్ రెడ్డి మృతదేహం ఫోటోల్లో కనిపిస్తున్న తీరు చూస్తుంటే... ఆయనను తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.  

  • Loading...

More Telugu News