వేలం పాటలో తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేలం పాటలో తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో ఈ రోజు పలు ప్రత్యేక నంబర్‌లపై రవాణా శాఖ వేలం వేసింది. ఎప్ప‌టిలాగే ఈ వేలంలోనూ ర‌వాణా శాఖ భారీగా ఆదాయాన్ని సంపాదించింది. ఈ వేలంపాట‌లో గవి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ తమ బెంజ్‌ కారు కోసం రూ.10.05 లక్షలు చెల్లించి ‘టీఎస్‌ 09 ఈటీ 9999’ నంబర్‌ను పొందింది. ఈ వేలం పాటలో సినీన‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ కారుకి ‘టీఎస్‌ 09 ఈయూ 0001’ నంబర్ ద‌క్కింది. అందుకోసం రూ.7.77 లక్షలు చెల్లించారు. ‘టీఎస్‌ 09 ఈయూ 0099’ నంబర్ ను ఆర్‌ఎస్‌ బ్రదర్స్ కంపెనీ రూ.2.70 లక్షలకు సొంతం చేసుకుంది. 

More Telugu News