: రైతుల డబ్బులు సినిమాపాలు... ఏడుగురు అధికారుల సస్పెన్షన్!
రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న సామెతలా ప్రకాశం జిల్లా రైతుల సొమ్ము సినిమాల పాలైంది. ఆ వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా రైతు సహకార సంఘం అధికారులు రైతులకు ఇవ్వాల్సిన డబ్బును సినిమా డిస్ట్రిబ్యూషన్ కు తరలించారు. తిరుపతి బ్రదర్స్ పేరుతో డిస్ట్రిబ్యూట్ అయిన తమిళ సినిమా 'సికందర్' తో పాటు మరొక సినిమాను ప్రకాశం జిల్లా రైతు సహకార సంఘం అధికారులు డిస్ట్రిబ్యూట్ చేశారు.
ఇలా మళ్లించిన 70 లక్షల రూపాయలను లెక్కతేలని సొమ్ముగా చూపించారు. ఇందులో ఆడిటర్లు కూడా కుమ్మక్కయ్యారు. ఆడిటింగ్ అనంతరం అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించగా, రైతుల సొమ్మును సినిమా డిస్ట్రిబ్యూషన్ కు వినియోగించారని తేలింది. దీంతో ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.