: తప్పించుకుని తిరుగుతూ రిటైర్ అయిన తొలి న్యాయమూర్తిగా జస్టిస్ కర్ణన్ రికార్డు!


సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షను విధించి, ఆపై పోలీసుల అరెస్టును తప్పించుకునేందుకు మాయమైన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్, పదవీ విరమణ రోజు కూడా కనిపించకుండా పోయారు. సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించిన తరువాత కనిపించకుండాపోయిన ఆయన.. అజ్ఞాతంలోనే వుండి పదవీ విరమణ చేసిన మొట్టమొదటి న్యాయమూర్తిగా రికార్డుల్లోకి ఎక్కారు.

ఈ ఉదయంతో ఆయన పదవీకాలం పూర్తి అయింది. ఆయన చెన్నైలో ఉన్నారని, శ్రీకాళహస్తి ప్రాంతంలో తిరిగారని వార్తలు వచ్చినప్పటికీ, ఇంతవరకూ ఆయన ఎక్కడున్నాడన్న విషయాన్ని పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ కు చెందిన డీజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలోని పోలీసు బృందం గత నెల 10 నుంచి చెన్నైలోనే ఉన్నా, ఆయన జాడను మాత్రం పసిగట్టలేకపోయింది.

  • Loading...

More Telugu News