: 16 రోజుల తరువాత హైదరాబాద్ కు తిరిగొచ్చిన వైఎస్ జగన్


గత నెల 25వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తన పర్యటనను ముగించుకుని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ కుటుంబం చేరుకోగా, వారికి వైకాపా కార్యకర్తలు, నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌ రెడ్డి, సైకం శ్రీనివాస రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శులు బసిరెడ్డి సిద్ధారెడ్డి, రామయ్య, గుడివాడ అమర్‌ నాథ్‌ తదితరులు జగన్ కు స్వాగతం పలకగా, విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా ఇంటికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News