: ప్ర‌భాస్‌ను ట్విట్ట‌ర్‌లోకి రప్పించే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ప్రతిజ్ఞ చేస్తున్నాను: రానా


‘బాహుబలి 2’ చిత్రంలో కలిసి నటించిన ప్రభాస్, రానాలు వారు ఇస్తోన్న ఇంట‌ర్వ్యూల‌లో ఒక‌రి గురించి మ‌రొక‌రు చెప్పుకుంటున్నారు. రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలకు సిద్ధమైన వేళ.. రానా ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ప్రభాస్ ఇంత వరకు ట్విట్టర్‌ ఖాతా ప్రారంభించలేద‌న్న విష‌యం గురించి రానా మాట్లాడాడు. ప్ర‌భాస్‌ ఫేస్‌బుక్‌లో మాత్రమే కొన్ని సంద‌ర్భాల్లో పోస్టులు చేస్తుంటాడు. ప్ర‌భాస్‌ను ట్విట్ట‌ర్‌లోకి రప్పించే ప్ర‌య‌త్నాన్ని తాను చేస్తాన‌ని, అందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాన‌ని రానా వ్యాఖ్యానించాడు. రానా చెప్పిన‌ట్లుగానే నిజంగానే ప్ర‌భాస్‌ను ట్విట్ట‌ర్‌లోకి లాగుతాడో లేదో చూడాలి.

  • Loading...

More Telugu News