: భూమిపై చకచకా నడిచేస్తున్న చేప.. మీరూ చూడండి!
సాధ్యం కాని పనులను వర్ణించేటప్పుడు చేపలు నడవలేవు.. గుర్రాలు ఎగరలేవు.. అని అంటుంటాం. చందమామ కథల్లో నడిచే చేపలను గురించి చదువుకుని ఆనంద పడ్డాం. కానీ, చిత్ర విచిత్రంగా ఇండోనేషియాలోని బాలిలో ఓ చేప భూమిపై ఎంచక్కా నడిచేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను జియోగ్రాఫిక్ ఛానెల్ పోస్ట్ చేసింది. ఓ ప్రెంచ్ డైవర్ సముద్రంలో డైవింగ్ చేస్తుండగా ఈ చేపను చూసి వీడియో రికార్డు చేశాడని తెలిపింది. ఈ చేప తనకు ఉన్న రెండు కాళ్లలాంటి అవయవాలతో నడిచేస్తోంది. ఈ చేపపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి కదిలారు. ఈ వీడియోను ఆన్‌లైన్లో తెగచూసేస్తున్నారు. మీరూ చూడండి చేప నడక..