: దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవు: టీఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి హెచ్చరిక


ఈ రోజు సంగారెడ్డిలో కాంగ్రెస్ నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ర్జ‌న‌లో ఆ ప్రాంత కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 1979 డిసెంబర్‌లో ఇందిరా గాంధీ సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించారని, అనంత‌రం 1980లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందామ‌ని అన్నారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ అక్క‌డి నుంచే ప్ర‌జాగ‌ర్జ‌న‌ను మొద‌లుపెట్టార‌ని  2019 ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుంద‌ని చెప్పారు.

త‌మ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ భిక్షతోనే కేసీఆర్‌ కుటుంబం పదవులు అనుభవిస్తోందని జ‌గ్గారెడ్డి అన్నారు. త‌మ‌ పార్టీ నేత‌ల‌పై టీఆర్ఎస్‌ దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. కొందరు టీఆర్ఎస్ నేత‌లు పోలీసు  వ్యవ‌స్థ‌ను కూడా దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. త‌మ పార్టీ కార్యకర్తలు తిరగబడితే మాత్రం ఎవ్వ‌రూ త‌మ ముందు నిల‌బ‌డ‌లేర‌ని అన్నారు.           

  • Loading...

More Telugu News