: ఇంతకుముందు నేను ఫిట్‌నెస్‌పై అంతగా శ్రద్ధ పెట్టేదాన్ని కాదు: సమంత
చెన్నై బ్యూటీ సమంతకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై శ్రద్ధ బాగానే ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని ఆమె సూచిస్తోంది. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనయినా చేయగలమని చెబుతోంది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఇంతకుముందు ఫిట్‌నెస్‌పై అంతగా శ్రద్ధ పెట్టేదాన్ని కాదని తెలిపింది. తాను ఇప్పుడు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని తెలిపింది. వ్యాయామంతో శారీరక దారుఢ్యం కూడా బాగుంటుందని, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపింది. ఆడవాళ్లు ప్రతిరోజు వ్యాయామం చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తోంది.