: దసరాకి స్పైడర్ తో వస్తున్నా: మహేష్ బాబు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతే కాకుండా తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన మహేష్ బాబు ఈ విషయం వెల్లడించారు. కాగా, ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు దర్శకుడు మురుగదాస్ కాగా, దీనికి సంగీతాన్ని హారిస్‌ జైరాజ్‌ అందిస్తుండగా, ఎన్వీఆర్‌ సినిమాస్‌ పతాకంపై ఎన్‌వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు.


  • Loading...

More Telugu News