: కశ్మీర్‌లో హింసకు అడ్డుకట్ట వేయండి.. ఐక్యరాజ్యసమితిని కోరిన పాక్


కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరోమారు ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. కశ్మీర్‌లో హింసకు అడ్డుకట్ట వేయాల్సిందిగా శనివారం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజాన్నికోరింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండడం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. కశ్మీర్‌లో జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆయన మెజారిటీ కశ్మీర్ ని మైనారిటీ భూభాగంగా మార్చివేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కశ్మీరీల స్వయం నిర్ణయాధికారానికి పాకిస్థాన్ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని సర్తాజ్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News