: ప్రత్యర్థులు దాడి చేసిన వేళ, ‘చంపిరి రా.. నన్ను చంపిరి రా’ అని అరిచిన వైకాపా నేత నారాయణరెడ్డి!
రాయలసీమలో వైకాపా నేత నారాయణరెడ్డిని చుట్టుముట్టిన వేళ, ఆయన ‘చంపిరి రా.. నన్ను చంపిరి రా’ అని అరిచారని వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్, ఘటనకు ప్రత్యక్ష సాక్షి ఎల్లప్ప వెల్లడించాడు. తమ వాహనాన్ని ట్రాక్టర్లతో ఢీ కొట్టించిన తరువాత, వారు తనను బయటకు లాగి "పోతావారా? నిన్నూ చంపాలా?" అని అడుగగా, తాను దిగి పారిపోయినట్టు ఎల్లప్ప చెప్పాడు. దాడికి వచ్చిన వారిలో నలుగురిని తాను గుర్తు పట్టానని, మిగతావారు ముఖానికి ముసుగులు ధరించి వచ్చారని తెలిపాడు. నారాయణరెడ్డి వాహనానికి వెనకాలే మరో జీపులో వస్తున్న ఆయన అనుచరుల్లో ముఖ్యుడైన కృష్ణమోహన్ గడచిన ఘటనను గుర్తు చేసుకుంటూ, పరిస్థితిని గమనించి దిగేలోపే తమపై బాంబులు వేశారని, తమ వద్ద ఆయుధాలు లేకపోవడంతో, తాము చచ్చిపోతామన్న భయంతో కృష్ణగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయాన్ని చెప్పామని, వారు వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని చెప్పాడు.