: నోకియా అభిమానులకు శుభవార్త... బడ్జెట్ ధరలో నోకియా ఫోన్ విడుదల
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న నోకియా బ్రాండ్ ఫోన్ ఈ రోజు మార్కెట్లోకి వచ్చేసింది. గత నెల 28నే ఈ ఫోన్ విడుదల అవుతుందని ఆ సంస్థ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అనంతరం ఇటీవలే ఈ నెల 18న తమ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు నోకియా ప్రకటించిన విషయం తెలిసిందే. నోకియా తన అభిమానులను ఆకట్టుకునేలా ఈ 2జీ ఫోన్‌లో సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. బ్యాటరీ కెపాసిటీ 1200 ఎంఏహెచ్‌తో నోకియా 3310 పేరిట ఈ ఫోన్ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర కూడా రూ.3310 అని నోకియా ప్రతినిధులు తెలిపారు. వార్మ్ రెడ్, ఎల్లో రంగుల్లోని ఫోన్లు గ్లోస్ ఫినిష్‌లో, డార్క్ బ్లూ, గ్రే ఫోన్లు మెటల్ ఫినిష్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్ ఫోన్‌లో ఎఫ్ఎం రేడియా, జ్యూక్ బాక్స్, ఎంపీ 3 ప్లేయర్, ఫొటోలు తీసుకునే సౌకర్యాలు ఉంటాయని వివరించారు.
నోకియా 3310 ఫీచర్లు..
- డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్)
- మైక్రో యూఎస్‌బీ,
- బ్లూటూత్
- 2 మెగాపిక్సల్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
- 32 జీబీల వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటు
- నోకియా సిరీస్ 30 ఆపరేటింగ్ సిస్టం
- 2.4 ఇంచెస్ కర్వ్‌డ్ విండో కలర్ క్యూవీజీఏ (240X 320) డిస్‌ప్లే