తీపికబురు చెప్పిన నోకియా.. బడ్జెట్ ధరలో ఎల్లుండే మార్కెట్లోకి నోకియా ఫోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తీపికబురు చెప్పిన నోకియా.. బడ్జెట్ ధరలో ఎల్లుండే మార్కెట్లోకి నోకియా ఫోన్

అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోన్న నోకియా ఫోన్‌ల అమ్మ‌కాలు ఎల్లుండి నుంచే ప్రారంభం కానున్నాయ‌ని హెచ్ఎండీ గ్లోబ‌ల్ తెలిపింది. నోకియా 3310 పేరిట మార్కెట్లోకి వ‌స్తోన్న ఈ ఫోన్ ధ‌ర కూడా రూ.3310 అని తెలిపింది. ఈ ఫోన్ లు నాలుగు రంగుల్లో ల‌భిస్తాయ‌ని పేర్కొంది. వార్మ్ రెడ్, ఎల్లో రంగుల్లోని ఫోన్లు గ్లోస్ ఫినిష్‌లో, డార్క్ బ్లూ, గ్రే ఫోన్లు మెటల్ ఫినిష్‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు చెప్పింది. ఈ ఫోన్ల డిజైన్‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు బాగా న‌చ్చుతాయ‌ని తెలిపింది. ఈ ఫోన్‌లు ఒక్కసారి ఛార్జింగ్ తో రోజంతా మాట్లాడుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ 2జీ ఫోన్ల‌లో ఎఫ్ఎం రేడియా, జ్యూక్ బాక్స్, ఎంపీ 3 ప్లేయర్, ఫొటోలు తీసుకునే సౌక‌ర్యాలు ఉంటాయ‌ని వివ‌రించింది.


 నోకియా 3310 ఫీచ‌ర్లు..

  •  డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్)
  •  నోకియా సిరీస్ 30 + ఆపరేటింగ్ సిస్టం
  •  2.4 ఇంచెస్‌ కర్వ్‌డ్ విండో కలర్ క్యూవీజీఏ (240X 320) డిస్‌ప్లే
  •  మైక్రో యూఎస్‌బీ,
  •  బ్లూటూత్
  •  2 మెగాపిక్సల్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  •  32 జీబీల వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటు

More Telugu News