: వైపీపీ సభ్యుల ఆందోళన మధ్యే.. జీఎస్టీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జీఎస్టీ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఓ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తిస్తుండగానే... ఈ బిల్లును ఆర్థిక మంత్రి యనమల సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ కొనసాగింది. చివరగా సీఎం చంద్రబాబు దీనిపై మాట్లాడారు. అనంతరం, బిల్లును ఆమోదించాల్సిందిగా స్పీకర్ ను యనమల కోరారు. వెంటనే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు.