Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోన్ లో నారాయణను పరామర్శించిన సింగపూర్ మంత్రి

ఏపీ మంత్రి నారాయణను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పరామర్శించారు. హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఈశ్వరన్... నారాయణకు ఫోన్ చేశారు.  ఈ సందర్భంగా నారాయణ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడం బాధాకరమని ఈ సందర్భంగా ఈశ్వరన్ అన్నారు. నిషిత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. 

More Telugu News