: ఆ రోజు బాబు ఢిల్లీలో ఎక్కడికెళ్లారు? ఎవరిని కలిశారు? ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?: వైఎస్ జ‌గ‌న్


అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తిరిగి ఢిల్లీకి మధ్యాహ్నం 2-3 గంటలకు వచ్చి, మళ్లీ 11 గంటల వరకు ఎవరికీ కనపడలేదని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...  బాబు ఎక్కడికెళ్లారు? అని ప్ర‌శ్నించారు. ఆయ‌న‌ ఎవరిని కలిశారు, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని జ‌గ‌న్ అడిగారు. ‘బీజేపీ సర్కారులో తనవాళ్లను చంద్ర‌బాబు మంత్రులుగా పెడతాడు, ఇక్కడ ఆయన రహస్యంగా తిరుగుతాడు, ఎవరిని కలిశాడో కూడా చెప్పడు’ అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తాను మాత్రం అన్ని విష‌యాల‌ను చెప్పుకుంటూనే ఉన్నాన‌ని అన్నారు.

ఈ నెల 9న రాత్రి త‌న‌కు పీఎంవో నుంచి ఫోన్ వచ్చిందని, పొద్దున్నే రమ్మన్నారని జ‌గ‌న్ తెలిపారు. ఉదయం 6.30 విమానానికి బయల్దేరి వెళ్లామ‌ని చెప్పారు. అయితే విమానంలో సాంకేతిక సమస్య రావ‌డంతో 7.30కి వేరే విమానంలోకి మారామ‌ని తెలిపారు. ఢిల్లీకి చేరుకునే స‌రికి సుమారు 10 అయ్యిందని తెలిపారు. తాము ఫ్రెషప్ అయ్యి వెంటనే ప్రధాని వద్దకు వెళ్లామ‌ని అన్నారు. మోదీకి ఇచ్చిన అర్జీ సహా అన్నీ మీడియాకు చూపించామ‌ని తెలిపారు. తాము అన్నీ పారదర్శకంగా చేశామ‌ని, చంద్ర‌బాబు మాత్రం తాను అన్ని గంట‌లు ఏమ‌య్యారో చెప్ప‌డం లేద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News