: నటుడు అల్లు అర్జున్ కారు డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు


ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కారు డ్రైవర్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1లో ఉన్న మోకాబాక్‌కు వెళ్లాడు. డ్రైవర్ మహిపాల్ రెడ్డి కారును పార్క్‌ చేసి పక్కన కూర్చున్నాడు. అదే సమయంలో మరో క్యాబ్ డ్రైవర్ రామకృష్ణ తన కారును రివర్స్ చేస్తూ అల్లు అర్జున్ కారును ఢీకొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిపాల్ రెడ్డి దెబ్బతిన్న తన కారుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అతడి కారును తీసుకెళ్లాడు.

ఆదివారం ఉదయం మహిపాల్ వద్దకు వెళ్తే రూ.20 వేలు అవుతుందని చెప్పడంతో బతిమాలుకున్నాడు. షోరూముకు వెళితే రూ.2 లక్షలు ఖర్చవుతుందని, కాబ్టటి రూ.20 వేలు ఇవ్వాలని బెదిరించాడు. తనకు అంత డబ్బు ఇచ్చే స్తోమత లేకపోవడంతో కారును బలవంతంగా లాక్కున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News