Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి.. కారును ఢీకొన్న లారీ

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా పులివెందుల మీదుగా బెంగళూరుకు వెళుతుండగా నామాలగుండు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబసభ్యులను పులివెందులలోని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News