: ట్రంప్ తనను తొలగించడంపై స్పందించిన ఎఫ్బీఐ డైరెక్టర్
ఎఫ్బీఐ డైరెక్టర్ గా తనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలగించడంపై జేమ్స్ కామీ స్పందించారు. తన సహోద్యోగులకు ఓ లేఖ రాసిన ఆయన... దాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఎఫ్బీఐ డైరెక్టర్ ను ఏదో ఒక కారణం చెప్పి... లేదా ఏ కారణం కూడా చెప్పకుండానే అధ్యక్షుడు తొలగించవచ్చనే విషయం తనకు తెలుసని చెప్పారు. తనను తొలగించిన విషయంపై తాను ఎక్కువగా స్పందించనని... మీరు కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండని తన సహచరులకు సూచించారు. మిమ్మల్ని, ఎఫ్బీఐని ఎంతో మిస్ అవుతున్నానని ఆయన పేర్కొన్నారు. మీ అందరితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమెరికా ప్రజల భద్రత విషయంలో రాజీపడకుండా పని చేయాలని సూచించారు. హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ సర్వర్ వాడకంపై విచారణను జేమ్స్ కామీ సరిగా హ్యాండిల్ చేయలేదన్న కారణంతో ఆయనను పదవి నుంచి ట్రంప్ తొలగించారు.