: కేజ్రీవాల్ రూ. 2 కోట్ల లంచం తీసుకోవడం నేను చూశాను: కపిల్ మిశ్రా వేసిన బాంబిదే!


అరవింద్ కేజ్రీవాల్ తొలగించిన మంత్రి కపిల్ మిశ్రా ముందుగా చెప్పినట్టుగానే, ఓ బాంబులాంటి వార్తను పేల్చారు. మంచినీటి ట్యాంకర్ల యజమానుల నుంచి రూ. 2 కోట్లను వసూలు చేసిన సత్యేంద్ర జైన్, తన కళ్ల ముందే ఆ డబ్బును అరవింద్ కేజ్రీవాల్ కు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాడినని, పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ఈ మధ్యాహ్నం రాజ్ ఘాట్ కు వచ్చి, మహాత్మునికి నివాళులు అర్పించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ లంచానికి తానే సాక్షినని, ఎటువంటి విచారణ జరిగినా సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆప్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఉన్న తాను పార్టీని వదిలివేస్తానని ఎందుకు అనుకుంటారని, పార్టీలో అవినీతి మకిలి అంటిన నేతలే తనను బలి చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News