: మహానాడు పనుల పర్యవేక్షణలో బిజీగా ఉన్న లోకేష్
వైజాగ్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ మహానాడు పనుల పర్యవేక్షణలో బిజీగా ఉన్నారు. మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్న ఆంధ్ర యూనివర్శిటీ ప్రాంగణాన్ని ఈ రోజు ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనశాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండ వేడిమి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, కార్యకర్తల కోసం వీలైనన్ని ఎక్కువ శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.