: పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనపై పళనిస్వామి స్పందన
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విలీనం కావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించని సంగతి తెలిసిందే. పన్నీర్, పళని వర్గాలకు చెందిన నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో, పన్నీర్ సెల్వం తమిళనాడు రాష్ట్రంలో పర్యటనలు మొదలు పెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. పన్నీర్ సెల్వం వర్గంతో తాము జరిపిన చర్చలు విఫలం కాలేదని ఆయన అన్నారు. ఇరు వర్గాలు కలవడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. పన్నీర్ వర్గంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. పార్టీ భవిష్యత్తు కోసం అందరం కలసి మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.