: న‌మ‌స్కార్‌, వ‌ణ‌క్కం, స‌లామాలేకుం: మోదీతో శ్రీ‌లంక అధ్య‌క్షుడు


పాకిస్థాన్ మిన‌హా ద‌క్షిణాసియా దేశాల‌కి సేవ‌లు అందించే ల‌క్ష్యంతో అభివృద్ధి చేసిన‌ జీశాట్‌-9 ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం విజ‌య‌వంతమైన నేప‌థ్యంలో ఈ రోజు సాయంత్రం భారత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, మాల్దీవులు, శ్రీలంక దేశాల అగ్రనేతలు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా శ్రీ‌ల‌ంక అధ్య‌క్షుడు మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ... త‌న ప్ర‌సంగాన్ని న‌మ‌స్కార్‌, వ‌ణ‌క్కం, స‌లామాలేకుం అంటూ మొద‌లుపెట్టారు. సార్క్ దేశాల మ‌ధ్య స‌హ‌కారం పెంచేందుకు ఇండియా ప్ర‌యోగించిన జిశాట్‌-9 ఉప‌గ్ర‌హం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న కొనియాడారు. సార్క్ స‌భ్‌య దేశాల కోసం ప్ర‌యోగించిన ఈ ఉప‌గ్ర‌హం... స‌హ‌కారంలో కొత్త అడుగు అని ఆయ‌న అభివ‌ర్ణించారు. భార‌త్ చేసిన కృషిని తాను కొనియాడుతున్న‌ట్లు చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News