: పాక్ పై ప్రతీకారం తీర్చుకోండి.. ఒకటికి 100 తలలు తీసుకురండి: రాందేవ్ బాబా


భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో పాక్ రేంజ‌ర్లు ఇటీవ‌లే దుస్సాహ‌సానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. స‌రిహ‌ద్దును దాటి వచ్చి, ఇద్దరు భార‌త‌ సైనికుల ప్రాణాలు తీసి, ఆపై వారి త‌ల‌లు మొండెం నుంచి వేరు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన‌ యోగా గురువు  రాందేవ్ బాబా పాకిస్థాన్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పతంజలి సంస్థ ఉత్పత్తులపై ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాక్‌ దుశ్చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. దీనికి ప్ర‌తీకారంగా ఒక్కో త‌ల‌కి 100 పాకిస్థాన్ రేంజ‌ర్ల‌ తలలు తీసుకురావాలని ఆయ‌న అన్నారు. ఇటువంటి ప‌ని చేయ‌డానికి మ‌న దేశ‌ సైనికులకు ఎలాంటి సందేహం అవసరం లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ రేంజర్లు పాల్పడ్డ దుశ్చర్య పట్ల భారత్ యావత్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

  • Loading...

More Telugu News