: మైదానంలోనే నొప్పితో విలవిల్లాడిన క్రికెటర్!


ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో భాగంగా ఈ రోజు వాంఖ‌డే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు త‌ల‌బ‌డుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌, కీలక ఆటగాడు క్రునాల్‌ పాండ్యా గాయపడి, మైదానంలో నొప్పితో విలవిల్లాడిపోయాడు.

లసిత్‌ మలింగ బౌలింగ్‌లో 15వ ఓవర్‌ నాలుగో బంతిని ఆర్సీబీ బ్యాట్స్ మెన్ పవన్‌ నేగి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా తరలించి, సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. అయితే, ఆ పరుగును అడ్డుకోవాలనే ఉద్దేశంతో క్రునాల్‌ పాండ్యా డైవ్ చేసి, అదుపుతప్పి బంతిపై పడడ‌తో ఆయ‌న‌కు గ‌ట్టిగా దెబ్బ త‌గిలింది. మైదానంలోకి వ‌చ్చిన‌ జట్టు సహాయక సిబ్బంది చికిత్స నిమిత్తం అతనిని బయటికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News