: కోహినూరు వజ్రానికి...ప్రభాస్ కి వెలకట్టలేం: కృష్ణంరాజు భార్య


కోహినూరు వజ్రానికి...ప్రభాస్ కి వెల కట్టలేమని ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భార్య అన్నారు. హైదరాబాదులో బాహుబలి 2 సినిమా చూసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. ప్రభాస్ రాజే కాదు, రాజులకు రాజు.. మహరాజులా ఉన్నాడని ఈ సినిమా చూసినవారు అంటున్నారని ఆమె చెప్పారు. సినిమా ఆద్యంతం అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు. రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ నటించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ప్రభాస్ తమ ఇంట్లో జన్మించడం తమ పూర్వజన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన అద్భుతమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News