: ‘మర్చంట్‌ పే’... ఆధార్‌, క్రెడిట్‌, డెబిట్‌, ఫోన్‌ ఆధారిత చెల్లింపులు ఒకే గొడుగు కిందకు


దేశం డిజిటల్‌ ఇండియా వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో సులువుగా న‌గ‌దుర‌హిత లావాదేవీలు జ‌రుపుకునేందుకు వీలుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ‘మర్చంట్‌ పే’ను ప్రారంభించింది. దీని ద్వారా క్రెడిట్‌, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులే కాకుండా ఆధార్‌, ఫోన్‌ ఆధారిత చెల్లింపులను కూడా చేసుకోవ‌చ్చ‌ని టీసీఎస్‌ గ్రోత్‌ మార్కెట్స్‌ అధ్యక్షుడు రవి విశ్వనాథన్ తెలిపారు.

 మ‌ర్చంట్ పే ద్వారా క‌స్ట‌మ‌ర్లు సులభంగా చెల్లింపులు చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. కేంద్ర స‌ర్కారు దేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆధార్‌ అనుసంధానం ఆధారంగా టీసీఎస్‌ ఈ ‘మర్చంట్‌ పే’ను తీసుకొచ్చిందని తెలిపారు. క‌స్ట‌మ‌ర్ల‌తో పాటు వ్యాపారులూ ఒకే డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం కింద ఈ-వాలెట్‌, ఆధార్‌పే లాంటి అన్ని రకాల చెల్లింపులను దీని ద్వారా చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న వివ‌రించారు.

  • Loading...

More Telugu News