కళాతపస్వి కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం

ప్రముఖ సీనీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 2016 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి విశ్వనాథ్ ను ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కు అభినందనలు తెలిపారు. కాగా, మే 3వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విశ్వనాథ్ కు అభినందనలు తెలిపారు. జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, శుభసంకల్పం వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.
Go Back to Shorts

More Telugu News