: చైనా దుర్మార్గం... అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు పట్టణాలకు సొంత పేర్లు


ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ, ఆ ప్రాంతం తమదేనని వాదిస్తున్న చైనా, ఇప్పుడు మరో దుర్మార్గానికి దిగింది. అరుణాచల్ లోని ఆరు పట్టణాలకు చైనా పేర్లు పెట్టి కవ్వింపులకు దిగింది. ఈ నెల 14న చైనా పౌర వ్యవహారాల శాఖ పట్టణాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు చైనా మీడియా పేర్కొంది. దలైలామా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించి, భారత దౌత్యాధికారులకు సమన్లు పంపిన చైనా, ఆ తరువాత 9 రోజులకు ఈ చర్యకు దిగడం గమనార్హం. రాష్ట్రంలోని ఆరు పట్టణాలకు వొగ్యలిన్‌ లింగ్‌, మిలా రీ, ఖ్యోడెన్‌ గార్బొ, మాణిఖ్వా, బుమొలా, నామకాపబ్‌ రీ అనే పేర్లు ఖరారు చేసినట్టు చైనా అధికారిక మీడియా వెల్లడించగా, ఇదంతా చైనా కుట్రని, ఆయా పట్టణాలకు ఆ పేర్లు పూర్వకాలానివని, వాటిని ప్రమాణీకరించలేదని టిబెట్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకులు పేర్కొన్నారు.

కాగా, 1962 నాటి చైనా - భారత్ యుద్ధ సమయంలో అరుణాచల్ లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్యా సరిహద్దు సమస్య నెలకొనగా, ఇప్పటివరకూ 19 సార్లు ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో సమావేశాలు జరిగినా, అవి ఓ కొలిక్కి రాలేదు.

  • Loading...

More Telugu News