తన వెబ్ సైట్ లో మహిళలను కించపరిచిన యోగి ఆదిత్యనాథ్... క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన వెబ్ సైట్ లో మహిళలను కించపరిచిన యోగి ఆదిత్యనాథ్... క్షమాపణకు కాంగ్రెస్ డిమాండ్

తన వెబ్ సైట్లోని వీక్లీ జర్నల్ లో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ, తన వెబ్ సైట్ కోసం యోగి రాసిన కథనాన్ని ఆయన ఉటంకించారు. 'యోగి ఆదిత్యనాథ్ టాట్ ఇన్' వెబ్ సైట్లో కామెంట్ సెక్షన్ లో మొదటి స్థానంలో ఉన్న ఓ ఆర్టికల్ లో 'మహిళా శక్తిని చిన్నతనంలో తండ్రి, వయసు వచ్చిన తరువాత భర్త, వృద్ధాప్యంలో కుమారుడు రక్షించాలి. మహిళలను స్వతంత్రంగా, స్వేచ్ఛగా వదిలివేయరాదు' అని రాసుకొచ్చారు.

నిత్యమూ మహిళల సమానత్వం, సాధికారతపై మాట్లాడే యోగి, తన వ్యాసంలో బీజేపీ మైండ్ సెట్ ను చెప్పకనే చెప్పారని విమర్శించిన సుర్జేవాలా, ఈ కామెంట్లను మోదీ, అమిత్ షాలు సైతం ఖండించకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే తన వెబ్ సైట్ నుంచి ఆర్టికల్ ను తొలగించి, మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆర్టికల్ ఎప్పుడు అప్ లోడ్ చేశారన్న విషయం తెలియకపోయినా, ఇది కనీసం ఏడేళ్ల క్రితం నాటిదని సమాచారం.

More Telugu News