: పతంజలి సంస్థ చంద్రబాబుకు బంధువా?: వైసీపీ
దళితులకు, పేద రైతులకు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమిని పతంజలి సంస్థకు కారు చౌకగా కట్టబెట్టేందుకు... ఆ సంస్థ ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంధువా? అని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగార్జున మండిపడ్డారు. అడ్డగోలుగా జరుగుతున్న ఈ భూ పందేరంపై అసెంబ్లీలో తమ అధినేత జగన్ మాట్లాడతారని ఆయన అన్నారు. ఎకరా రూ. 30 లక్షల విలువైన భూమికి కేవలం రూ. 7.50 లక్షల విలువను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. భూమి లేని వారికి రాజశేఖరరెడ్డి లక్షలాది ఎకరాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు సర్కారు మాత్రం దళితుల నుంచి భూమిని లాక్కుంటోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యమం చేపడతామని చెప్పారు.