: జయలలిత మృతికి కారణం ఫ్రూట్ జ్యూసా?...సోషల్ మీడియాలో ఆసక్తికర కథనం హల్ చల్


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మాసివ్ హార్ట్ అటాక్ కు గురికావడంతో మృతి చెందారని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తరువాత ఆమెకు వైద్యం అందించిన ప్రత్యేక వైద్యుడు, ఎయిమ్స్ వైద్యులు కూడా అదే సంగతి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని వివిధ సందర్భాల్లో ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జయలలిత మృతిపై సోషల్ మీడియాలో సరికొత్త కథనం హల్ చల్ చేస్తోంది. దీని వివరాల ప్రకారం... అపోలో ఆసుపత్రి వైద్యుల చికిత్సతో జయలలిత బాగా కోలుకున్నారు. ఈ స్ధితిలో డాక్టర్ల అనుమతి లేకుండా ఆమె తాగిన పండ్ల రసం వల్లే గుండెపోటుకు గురయ్యారు.

జయలలిత పండ్ల రసం తాగుతున్న సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులు కూడా ఆమెను వారించలేదని, ఫ్రూట్ జ్యూసే కదా అని వారు తేలిగ్గా తీసుకున్నారని, అయితే ఆ జ్యూసే ఆమె కొంపముంచిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, మరోవైపు జయలలిత మృతిపై నిజాయతీకి మారుపేరుగా ప్రసిద్ధిగాంచిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సహాయం నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఐఆర్‌ఎస్‌ అధికారి బాలమురుగన్‌ మద్రాసు హైకోర్టులో పిటీషన్‌ వేశారు. ఇప్పటికే ఇలాంటి అభ్యర్థనతో గతంలో కొన్ని పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్లన్నింటినీ జూలై 4న విచారణకు స్వీకరించనున్నట్లు మద్రాసు హైకోర్టు తెలిపింది. 

  • Loading...

More Telugu News