: రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులతో పాటు ఖైదీ మృతి
బీహార్ లోని ముజఫర్ పూర్ లో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పోలీస్ వ్యాన్ ను ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పోలీస్ వ్యానులో వెళుతున్న నలుగురు పోలీసులతో పాటు, ఓ ఖైదీ మృతి చెందాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.