: కోహ్లీని పరామర్శించిన ప్రియురాలు అనుష్క శర్మ


భుజం గాయంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ... భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతనే బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో, బెంగళూరులో కోలుకుంటున్న కోహ్లీని అతని ప్రియురాలు, సినీనటి అనుష్క శర్మ పరామర్శించింది. నెక్ట్స్ ఐపీఎల్ మ్యాచ్ లో కోహ్లీ ఆడబోతున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే, అతన్ని ఉత్సాహపరిచేందుకు అనుష్క వచ్చినట్టు సమాచారం. వాస్తవానికి కోహ్లీ ఆడే మ్యాచ్ లకు అనుష్క హాజరవుతుండేది. కానీ, ఆమె స్టేడియంకు వస్తుండటం వల్ల కోహ్లీ సరిగ్గా ఆడటం లేదనే విమర్శలు ఎక్కువ అవడంతో... మ్యాచ్ లకు ఆమె దూరంగా ఉంటోంది. ఏదేమైనప్పటికీ, కోహ్లీని పరామర్శించి బయటకు వస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News