: మద్యం తాగి విమానం నడిపిన ఎయిరిండియా పైలెట్!
మద్యం తాగి విమానం నడిపిన ఓ పైలెట్‌ను ఎయిరిండియా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. విమానయాన నిబంధనల ప్రకారం విధి నిర్వణకు 12 గంటల ముందు నుంచి పైలెట్లు మద్యం ముట్టకూడదు. అటువంటింది ఎయిరిండియాకు చెందిన ఒక పైలెట్ బడ్జెట్ ఎయిర్‌లెయిన్స్ డిప్యూటేషన్‌పై పనిచేస్తూ నిన్న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో విధులు నిర్వహిస్తూ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో పట్టుబడ్డాడు. దీంతో సదరు విమానయాన సంస్థ అతడిపై చర్యలు తీసుకుంది. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో గత ఏడాది మొత్తం 224 మంది పట్టుబడ్డారని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా 2015లో 202 మంది విఫలమయ్యారు.