: 'కాస్త‌ లిఫ్టు ఇస్తారా?' అని అందంగా అడుగుతున్న యువతులు.. ఆపై దోపిడీ చేస్తున్న వైనం!


బెంగళూరులో కిలాడీ లేడీలు రెచ్చిపోతున్నారు.. మాయమాటలు మాట్లాడుతూ, వయ్యారాలు ఒలకబోస్తూ బంగారం, డబ్బు దోచుకెళుతున్నారు. అర్ధరాత్రి వీధుల్లో కార్లలో తిరిగే మగాళ్లే లక్ష్యంగా వారు మ్యాజిక్కులు చేస్తున్నారు. కార్లు ఆపి కాస్త‌ లిఫ్టు ఇస్తారా? అని అడుగుతున్నారు. ఇంత అంద‌మైన‌ అమ్మాయి క‌న‌ప‌డితే లిఫ్ట్ ఇవ్వ‌మా అంటూ కారు ఎక్కించుకున్నారో.. ఇక వారి ఒంటిమీది న‌గ‌లు, జేబులోని డ‌బ్బు మాయ‌మ‌యిన‌ట్లే. అమ్మాయి చేతిలో మోస‌పోయామ‌ని బ‌య‌ట‌కు చెప్పుకునేందుకు కూడా బాధితులు అవ‌మానంగా భావిస్తున్నారు. ఇటువంటి నేరాలు బెంగ‌ళూరులో అధిక‌మై పోతున్నాయి.

అక్క‌డి ఇందిరానగర్‌‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఆయ‌న ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌డంతో ఈ నేరాల గురించి తెలిసింది. జేబీనగర్‌లో తన ఫ్రెండ్స్‌ను డ్రాప్ చేసి తిరిగొస్తున్న త‌న‌కు ఓ యువతి నవ్వుతూ రోడ్డు పక్కన కనిపించిందని, త‌న‌  కారును ఆపి, లిఫ్ట్ కావాలని అడిగింద‌ని ఆయ‌న చెప్పారు. కారు ఎక్కగానే త‌న‌ను గట్టిగా హత్తుకుంద‌ని చెప్పారు. అయితే, తాను ఆ యువ‌తిని కారు దిగాలని, లేకపోతే పోలీసులను పిలుస్తానని చెప్పాన‌ని అన్నాడు. దీంతో ఆ యువ‌తి కారు దిగి వెళ్లిపోయిందట. అయితే, ఆ వ్యాపారి మెడలోని గోల్డ్ చైన్ క‌నిపించ‌లేదు. దీంతో ఆ వ్యాపారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News