: 19వ అంతస్తు నుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
మాదకద్రవ్యాలకు బానిసైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఓ హోటల్‌లో 19వ అంతస్తు నుంచి దూకిన ఘటన మహారాష్ట్రలోని బంద్రా శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది రక్తపు మడుగులో ఉన్న ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు చూస్తే బెంగళూరుకు చెందిన అర్జున్ భరద్వాజ్ మహారాష్ట్రలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతూ బంద్రాలో ఓ హోటల్‌కి వచ్చి, 19వ అంతస్తులో గది తీసుకుని ఉన్నాడు.
ఈ క్రమంలోనే నిన్న రాత్రి తన గది కిటికీ నుంచి దూకేశాడు. అంతకు ముందు సోషల్‌మీడియాలో ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అనే ఓ వీడియో పోస్టు చేశాడు. తాను మాదకద్రవ్యాలకు బానిసయ్యానని, తనకు బతకాలని లేదని హోటల్ గదిలో సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు.