: గాయం కారణంగా.. ఐపీఎల్ కు కేఎల్ రాహుల్ దూరం


ఐపీఎల్ కు టీమిండియా ఓపెనర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టు సిరీస్ లో భుజం గాయానికి గురైన కేఎల్ రాహుల్ కు వైద్యపరీక్షలు నిర్వహించగా, రెండు నెలలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో సుదీర్ఘ కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని కేఎల్ రాహుల్ ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నాడు. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై రాహుల్ ఐపీఎల్ లో తన జట్టు ఆర్సీబీకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 

  • Loading...

More Telugu News